ప్రముఖ సంస్థలైన వొడాఫోన్, ఐడియాలు చేతులు కలిపాయి. ఈ సంస్థల విలీన ప్రక్రియ దాదాపు పూర్తయినట్లే. కానీ దీనికి టెలికాం శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. అయితే వొడాఫోన్-ఐడియా విలీనానికి టెలికాం శాఖ సోమవారం ఆమోదముద్ర వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విలీనానికి రేపు ఆమోదముద్ర వేసి.. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వొడాఫోన్, ఐడియాలకు అందజేసే అవకాశముందని సదరు వర్గాలు తెలిపాయి.