హీరోయిన్ మెహ్రీన్ కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఓ విమానాశ్రంలో ఆమెను అరగంట సేపు అధికారులు విచారించారు. ఈ విషయన్ని స్వయంగా ఆమే తెలిపింది.అమెరికాకు వచ్చే ప్రతి నటిని విచారిస్తున్నట్టు అధికారులు చెప్పారని తెలిపింది. మరో ముగ్గురు హీరోయిన్లను కూడా దాదాపు 6 గంటల సేపు విచారించినట్టు తెలుస్తోంది.