తలను, మొండంను వేరు చేసి..
కాంగ్రెస్ నేత బొడ్డుదపల్లి శ్రీనివాస్ హత్యను మరువక ముందే నల్గొండలో మరో దారుణం జరిగింది. కనగల్ గ్రామానికి చెందిన పాలకూరి రమేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు ఘోరాతి ఘోరంగా చంపేశారు. తలను, మొండాన్ని వేరు చేసిన హంతకులు.. తలను జెండా గద్దెపై పెట్టి మొండాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌ను ఇంత దారుణంగా చంపడానికి కారణాలేంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో(కామెర్లు)బాధపడుతున్న రమేష్.. ఆదివారం రాత్రి మందు తెచ్చుకోవడం కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం అయ్యే సరికి ఆయన దారుణంగా హత్య చేయబడ్డాడు.