శేషాచల అడవుల్లో విస్తారంగా విస్తరించిన అరుదైన వృక్షసంపద ఎర్రచందనం. దేశ సంపదగా పరిగణిస్తున్న ఈ వృక్షాలను సంరక్షించుకునేందుకు ప్రభుత్వం ప్రాధన్యతనిస్తోంది. అధికారయంత్రాంగం కూడా కృషిచేస్తోంది. విలువైన ఎర్రచందనం వృక్షాలకు స్మగ్లర్లబారిన పడకుండా కొన్నేళ్ళుగా అటవీ, పోలీసు శాఖలోని సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా ఎర్రచందనం దుంగలను కాపాడుతున్నారు. అయితే కొందరు అవినీతి సిబ్బంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ వృక్షాలను సరిహద్దు దాటేలా సహాయ సహకారాలు అందించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాదళం ఏర్పాటు చేసింది. ఈ ఎర్రచందనం పరిరక్షణ ప్రత్యేక కార్యాదళం ఐదు జిల్లాల్లో విస్తరించి వున్న ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు ప్రణాళకలు సిద్దం చేసి వ్యుహరచనతో అడుగులు వేసింది. ఈ క్రమంలో టాస్క్‌పోర్స్ దూకుడుకు స్మగ్లర్లు తాళలేక పోయారు. దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలుగా జరుగుతున్న ఎర్రచందనం అక్రమరవాణా ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టింది. కానీ స్మగ్లర్లు కొత్త కొత్త్త విదానాలతో ఎర్రచందనం అక్రమరవాణ చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
టాస్క్‌పోర్స్ అనుసరిస్తున్న విధానాల తో స్మగ్లర్లు అక్రమ రవాణా రూట్ మార్చుకున్నారు. ఈ క్రమంలో అక్రమరవాణాకు వినియోగించే వాహనాలను టాస్క్‌పోర్స్ సిబ్బందికి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కంటైనర్ లో ప్రత్యేక క్యాబిన్ ,హెవి గ్యాస్ కారియర్, ప్రముఖ సంస్థల స్టిక్కర్లు అటించిన వాహనాలను వినియోగిస్తూ దందా సాగించేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలను ఏ విధంగా మార్పులు చేసుకొచ్చినా ప్రత్యేక కార్యాదళం వారిని విడిచి పెట్టలేదు. టాస్క్‌పోర్స్‌లోని ఓ బృందం తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, వాలాజా, చెంగం వంటి ప్రాంతాల్లో దాదాపు నాలుగు వారాలు తమిళనాడులో మాటువేసి అక్రమ రవాణాకు వాహనాలను తయారు చేసే వారిని అదుపులోకి తీసుకుంది. ఎర్రచందనం అక్రమరవాణా పూర్తిగా తుడిచిపెట్టుక పోవాలంటే టాస్క్‌పోర్స్‌కు తగిన సిబ్బంది అవసరం. అయితే సిబ్బందికి కొరత ఉన్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ కు మరింత సిబ్బంది అందుబాటులో ఉంటే స్మగ్లర్లకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.