YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ కు ఇంకా రాని మంచి రోజులు

 కాంగ్రెస్ కు ఇంకా రాని మంచి రోజులు
రాజకీయాల్లో రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే సీరియస్‌గా తీసుకోవడంలేదు. కాంగ్రెస్‌ అధికారంలో వున్నప్పుడు మాత్రం 'కాబోయే ప్రధాని..' అంటూ నానా యాగీ చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, ఆ తర్వాత ఆయన్ని లైట్‌ తీసుకున్నారు. 2014ఎన్నికలతో పోల్చితే, 2019ఎన్నికల్లో కాసిన్ని ఎక్కువ సీట్లు కాంగ్రెస్‌కి దక్కే అవకాశం వుంది. అలాగని, బీజేపీని మించి కాంగ్రెస్‌ సీట్లు సాధిస్తుందని అనుకోలేం. అదే గనుక జరిగితే, ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ ఇంకొకరికి మద్దతిచ్చి, బీజేపీని అధికారంలోకి రాకుండా చేయొచ్చు. రాహుల్‌ మాటల్లోనే ఇదే విశ్లేషణ కన్పిస్తోంది. 'నేను ప్రధాని అవడం ముఖ్యం కాదు..' అని పరోక్షంగా ఆయన సంకేతాలు పంపేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అప్పట్లో రాజకీయంగా ఎదిగేందుకు వున్న అన్ని అవకాశాల్నీ రాహుల్‌గాంధీ సైతం వదిలేసుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? జస్ట్‌ టైమ్‌ పాస్‌ పొలిటీషియన్‌.. అనే గుర్తింపు మాత్రమే, రాజకీయాల్లో రాహుల్‌గాందీ సంపాదించుకున్నారు.వారసత్వంగా రాహుల్‌గాంధీకి 'ఎఐసిసి అధ్యక్ష పదవి' దక్కిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. 2014ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం అనంతరం, రాహుల్‌గాంధీ చాలా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. చాలా సార్లు పరాభవాన్నే ఎదుర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల విజయాలు కాంగ్రెస్‌కి దక్కినా, అవి కాంగ్రెస్‌ ఖాతాలో పడలేదు. మరి, 2019ఎన్నికల నాటికి పరిస్థితులు ఏమన్నా మారతాయా.? రాహుల్‌గాంధీని కనీసం ప్రధాని అభ్యర్థిగా అయినా చూడగలమా.?రాహుల్‌ మాటల్లో అయితే, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఒక్క తాటిపైకి రావాల్సి వుంది. అలా వస్తే, రాహుల్‌ ఆ కూటమికి నాయకత్వం వహిస్తారని మనం అనుకోవాలి. కానీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత దుస్థితి నేపథ్యంలో, 'లీడర్‌షిప్‌'ని మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చేందుకు బహుశా దేశంలో ఇతర రాజకీయ పార్టీలేవీ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు.కర్నాటకలో ఏం జరిగిందో చూశాం. 78 సీట్లు వచ్చినా, సరే.. 40 సీట్లు కూడా రాని జేడీఎస్‌ని అధికార పీఠమెక్కించాల్సి వచ్చింది కాంగ్రెస్‌ పార్టీకి. బీజేపీని ఓడించాలంటే, ఆ మాత్రం త్యాగం తప్పదని కాంగ్రెస్‌ అనుకుంది మరి. ఇదే ఈక్వేషన్‌ జాతీయ రాజకీయాలకు వర్తించవచ్చా.? అంటే, అసెంబ్లీ ఎన్నికలకీ పార్లమెంటు ఎన్నికలకీ చాలా తేడా వుంటుంది కాబట్టి.. పూర్తిగా అప్లయ్‌ చేసెయ్యలేం.ప్రధాని పదవి కోసం దేశంలో చాలామంది రాజకీయ ప్రముఖులు కాసుక్కూర్చున్నారు. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. వీళ్ళేనా, చంద్రబాబుకీ ఈ మధ్య ప్రధాని పదవిపై ఆశ పెరుగుతోంది. ఆ పదవి దొరుకుతుందా.? లేదా.? అన్నది వేరే విషయం. ఆశపడటమైతే తప్పు లేదు కదా.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అన్నట్టు ఆశలు చాలామందిలోనే కన్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, మమతా బెనర్జీ కేంద్రంలో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువే. ప్రధాని పదవి అంటే ఆషామాషీ కాదు. దాన్ని వదులుకునేందుకు రాహుల్‌ సిద్ధపడతారని అనుకోలేం. ఎందుకంటే, 'నేనే ప్రధానినైతే..' అంటూ ఈ మధ్య పలు సందర్భాల్లో రాహుల్‌ మనసులో మాటని బయటపెట్టేసుకున్నారండోయ్‌. కానీ, తప్పదు.. ఇంకోసారి ప్రతిపక్షంలో వుండాల్సి వస్తే.. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో పూర్తిగా పుట్టగతుల్లేకుండాపోయే ప్రమాదం వుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో.

Related Posts