సెలబ్రిటీ క్రికెక్ లీగ్ ద్వారా పేరు తెచ్చుకున్న విష్ణు ఇందూరి బయోపిక్‌లతో దూసుకు వెళుతున్నారు. ఇప్పటికే ‘ఎన్టీఆర్’బయోపిక్‌తో నిర్మాతగా మరిన ఆయన తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఆమె ఆ తర్వాత అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. వెండితెర నుంచి ముఖ్యమంత్రి స్థాయికి జయలలిత ఎదిగిన వైనంతో పాటు, ఆమె మరణం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను తెరమీదకు తెచ్చే ప్రయత్నాల్లో విష్ణు ఇందూరి బిజీగా ఉన్నారు.ఇప్పటికే జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణతో పాటు బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే జయలలిత పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటుగా క్రికెట్లో భారతదేశానికి తొలి వరల్డ్‌కప్‌ను సాధించిన స్టార్ మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ బయోపిక్‌ను విష్ణు ఇందూరి తెరకెక్కిస్తున్నారు.