YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఇక ఇంగ్లీషు మీడియం స్కూళ్లు

ఇక ఇంగ్లీషు మీడియం స్కూళ్లు
పాఠశాల పునః ప్రారంభం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల బోధన ప్రారంభించారు. ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఆంగ్లమాధ్యమాన్ని బోధిస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రతి ఒక్కరికీ ఉచితంగా బోధించాలని నిర్ణయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇంగ్లీషు మీడియం విద్యా బోధనను ప్రారంభించే గ్రామాల్లోని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆంగ్ల బోధనతో కలిగే ప్రయోజనాలు, విద్యార్థుల ఆసక్తి, ఆంగ్లంపై ఇష్టంలేనివారికి తెలుగు మీడియంలోనూ బోధించే వెసులు బాటు ఉందని ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. రూ. వేలకు వేలు ఖర్చుపెట్టి ప్త్రెవేట్‌ బడులకు తమ పిల్లలను పంపితే ప్రయోజనం ఉండదని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత కల్గిన ఉపాధ్యాయులతో ఆసక్తికరమైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ప్రచారం నిర్వహిస్తున్నారు.

Related Posts