YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభివృద్దిని దేశం దృష్టికి తెచ్చాం : సీఎం చంద్రబాబు

అభివృద్దిని దేశం దృష్టికి తెచ్చాం : సీఎం చంద్రబాబు
నాలుగేళ్ల అభివృద్ధి నీతి అయోగ్ వేదికగా దేశం దృష్టికి తెచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నిర్వహించిన నీరు-ప్రగతి,వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ లో అయన మాట్లాడారు. అదివారం జరిగిన  నీతి అయోగ్ భేటిలో ఏపిలో సాధించిన వృధ్దిని దేశం దృష్టికి తెచ్చాం.మనరాష్ట్రంలో జల సంరక్షణ,పంట మార్పిడి,పండ్లతోటల వృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ విధానాలు జాతీయ స్థాయిలో ఒక నమూనాగా మారాయి.పంటల మద్ధతు ధర(ఎంఎస్ పి)లో లోపాలను చర్చనీయాంశం చేశాం.స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకపోవడాన్ని నిలదీశాం.నరేగాను వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేశాం.రైతుల రాబడి రెట్టింపు అయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించామని అన్నారు. నీటి నిర్వహణలో గుజరాత్,మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్ మొదటి 3స్థానాలలో ఉన్నాయి.మొదటిస్థానం పొందేందుకు మరింత సమర్ధంగా కృషిచేయాలి.నీటి నాణ్యతపై,రక్షిత తాగునీటి సరఫరాపై మరింత దృష్టిపెట్టాలి.వర్షపాతం తక్కువ ఉన్నా సమర్ధ నీటి నిర్వహణ ద్వారా నీటికొరత అధిగమించాలి.రెయిన్ గన్ టెక్నాలజి,జీబా టెక్నాలజి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతఏడాది కన్నా తాగునీటి రవాణా గ్రామాల సంఖ్య సగానికి తగ్గింది.తాగునీరు రవాణా చేసిన 500గ్రామాల్లో ఇంజక్షన్ బోర్ వెల్స్ చేపట్టాలి.వచ్చే ఏడాది తాగునీటి రవాణా అనేదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి.కేవలం నీటి భద్రత ఇవ్వడమే కాదు,నాణ్యమైన నీటిని అందుబాటులోకి తేవాలి.వాతావరణ సమస్యలను అధిగమించాలి.అప్పుడే సుస్థిర ఆర్ధికాభివృధ్ధిని సాధించగలమని అన్నారు. ఈ 17రోజుల్లో నరేగాలో రూ.576కోట్ల పనుల లక్ష్యం చేరాం-జూన్ లో రూ.1,000కోట్ల టార్గెట్ అధిగమించాలి. మద్దతుధర,డిమాండ్ ను బట్టి పంట మార్పిడిని ప్రోత్సహించాలి.ఈ నెల 17రోజుల్లో నరేగాలో రూ.576కోట్ల పనుల లక్ష్యం చేరాం.జూన్ లో నరేగా రూ.1,000కోట్ల టార్గెట్ అధిగమించాలి.ఘన వ్యర్ధాల నిర్వహణ మరింత సమర్ధంగా జరగాలి.ఓడిఎఫ్ తరహాలో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.షెడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలి.మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.830కోట్లు సిద్ధంగా ఉన్నాయి,సిమెంట్ రోడ్లు,డ్రెయిన్లు తదితర పనులు ముమ్మరం చేయాలని అయన సూచించారు. మొక్కలు నాటడం,చెట్ల సంరక్షణలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలి. ప్రతిగ్రామంలో,వార్డులో వృక్షమిత్రలను ప్రోత్సహించాలి. వ్యవసాయంలో సంక్షోభం అధిగమించాం.జల సంరక్షణ ముమ్మరం చేశాం.గ్రామాలలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశాం.పేదల సంక్షేమం పెద్దఎత్తున చేస్తున్నాం.ఇన్నిపనులు చేయడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. జనవరికల్లా ప్రజల్లో సంతృప్తి 90%కు చేరుకోవాలి.అధికారులు మరింత సమర్ధంగా,సమన్వయంగా పనిచేయాలని అయన అన్నారు. 

Related Posts