YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే..జగనే సీఎం

ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే..జగనే సీఎం
ఆనాడు  తిరగబడమంటే, చంద్రబాబు  ఆలస్యం చేసారు. రాష్ట్ర  ప్రభుత్వ తీరువల్లే ఏపీకి  నష్టం వాటిల్లింది. ప్రత్యేక హోదా పై దీక్షలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్  మీట్ ది ప్రెస్ లో మాజీ ఎంపి ఉండవల్లి మాట్లాడారు. పోలవరం 2019కి పూర్తవ్వడం సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ గెలుస్తాడని అయనఅన్నారు. అయితే చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎన్నికల మేనేజ్మెంట్ చంద్రబాబు దిట్ట. జనసేన తో ఎవరు కలుస్తారో తెలిశాకే పవన్ కు ఎన్నిసీట్లు వస్తాయో చెప్పగలం. 60ఏళ్ళు వచ్చాక రాజకీయ పార్టీలలో వుండకూడదని నిర్ణయించుకున్నా. అందుకే రాజకీయాలలో వుంటా...  కానీ  ఏ రాజకీయ పార్టీలో చేరను. ప్రస్తుతం రాజకీయం పెట్టుబడుల వ్యాపారంగా మారిపోయిందని అయనఅన్నారు.    "ఏదైనా సరే వేడిలో వేడి చేయాలి. మొదట్లోనే ప్రత్యేక హోదా గురించి వత్తిడి చేయాల్సి వుంది. ఆరోజే తిరగబడమంటే చంద్రబాబు ఎందుకో మాట్లాడలేదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోకసభలో నోటీసు ఇమ్మంటే ఎవరూ ఇవ్వలేదు. ఇచ్చివుంటే కనీసం చర్చ జరిగేది. ఇక  ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు  దానికి  కట్టుబడలేదు. ఇప్పుడు హోదా అంటే కష్టమే. పైగా ప్రత్యేక హోదాపై ప్రస్తుతం జరుగుతున్న తతంగాన్ని పోరాటంగా చెబుతున్నారు. నిజానికి  ఇందులో పోరాటం ఏమి వుంది. సభ పెడితే పోరాటమా,దీక్ష చేస్తే పోరాటమా? అసలు పోరాటం అనడమే కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వ తీరువాలనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది"అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విశ్లేషించారు. 
 "రాష్ట్ర విభజన అన్యాయమని రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని 2014లోనే సుప్రీం కోర్టులో కేసు వేసాను. అయితే లోకసభలో సాక్షాత్తూ  ప్రధాని మోడీ  కూడా ఏపీని అన్యాయంగా విభజించారని చెప్పాక,దాన్ని జతచేసి అదనపు అఫిడవిట్ వేసాను. నిజానికి చట్టసభల్లో జరిగిన నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోవు. అందుకే సభా నాయకుడు అయిన ప్రధాని చేసిన వ్యాఖ్యలను జోడించి అదనపు అఫిడవిట్ వేసాను.  ప్రత్యేకంగా మేధావులు వచ్చి నిర్ధారణ చేయక్కర్లేదు. ఒకవేళ ఎవరినైనా పిలిచి సదస్సు పెట్టాలంటే అదీ చేయవచ్చు   ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిపిస్తే జగన్ గెలుస్తాడని, అయితే చంద్రబాబుని తక్కువ అంచనా వేయకూడదని అన్నారు. ఎన్నికల మేనేజ్ మెంట్ లో చంద్రబాబు దిట్ట అని,టిడిపికి క్షేత్రస్థాయిలో బలం కూడా ఉందని ఆయన అన్నారు. ఆనాడు లక్ష్మీ పార్వతి ని చూడ్డానికి జనం పెద్దఎత్తున వచ్చినా సరే,ఎన్టీఆర్ ని చంద్రబాబు మోసం చేసాడని చెప్పినా సరే,చంద్రబాబు గెలిచాడని,ఎన్టీఆర్ కుటుంబాన్ని పక్కన పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు విజయం నమోదుచేసుకున్నారని  విశ్లేషించారు. ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని,అందుకే సభకు జనాన్ని తీసుకు రావాలంటీ, పలావు పేకెట్స్ అన్నీ ఇవ్వాలని,అదే జగన్ అయితే బస్సు పంపితే ఎక్కివస్తారని,ఇక పవన్ కళ్యాణ్ అయితే స్వచ్ఛందంగా జనం వస్తారని ఉండవల్లి అన్నారు.    పోలవరం ప్రాజెక్ట్  ఇప్పుడు చేస్తున్న పని ప్రకారం 2019నాటికీ పూర్తవ్వడం కష్టమన్నారు. 2023-24కి పూర్తికావచ్చని అన్నారు. స్టోరేజ్ కెపాసిటీ తగ్గించేసి కేవలం ధవళేశ్వరం ఆనకట్ట మాదిరిగా కట్టేసి, కాపర్ డ్యాం ద్వారా నీరు మళ్ళించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్టు వున్నారని వ్యాఖ్యానించారు  పట్టిసీమ ప్రాజెక్ట్ కేవలం కృష్ణా డెల్టాను కాపాడ్డం కోసం కట్టారని ఆయన  చెప్పారు. గతంలో చాలా ఎత్తిపోతల పధకాలు కట్టిన సందర్భాలున్నాయని,అయితే పట్టిసీమ కోసం ఎక్కువ ప్రచారం ఇవ్వడమేకాకుండా, అధికమొత్తం  వెచ్చించారని ఉండవల్లి పేర్కొంటూ అధికంగా వెచ్చించడం గురించి కాగ్ కూడా చెప్పిందని ఆయన గుర్తుచేశారు.

Related Posts