YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 రాష్ట్రంలో నిధులు సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి

  రాష్ట్రంలో నిధులు సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి

-  కేంద్రం  నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే ముందంజ..

-  తెలుగుదేశం, బిజెపిల మధ్య మాటల యుద్ధం

బిజెపి నేతలు మిత్రధర్మం పాటించటంలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించగా…బిజెపి నేతలు అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. ఎవరికి వారు తమ వాదనలు విన్పిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. మిత్రఫక్షాలుగా ఉన్న తెలుగుదేశం, బిజెపిల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. కేంద్ర నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేయటంతో పాటు…సొంత డబ్బాకు వాడుకుంటోందనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా.. అది టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్టు చూపించుకుంటున్నారని ఆరోపించారు.  రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్న నిధులన్నీ కేంద్రానివేనని,  రాష్ట్రంలో నిధులు సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. తాము చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు చూపించడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు ప్రతి జిల్లాకూ రూ. 6 నుంచి 7 కోట్లు ఇస్తున్నామని, కానీ, ఈ నిధులు దుర్వినియోగమవుతున్నాయని విమర్శించారు.

సీఎం దావోస్ పర్యటనలో అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కారణం ప్రధాని మోదీనే అన్నారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు పాలించిన కాలంలో కరెంట్ కొరత ఉండేదని, మోదీ వచ్చాక కరెంట్ కొరత లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ఎన్టీఆర్‌ జలసిరి పథకం నిజం కాదని,  బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న సోలార్ పంపు సెట్లనే ఆ పథకం కింద ఇస్తున్నారని అన్నారు. చంద్రన్న బీమా తమ ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆ పథకంలో రాష్ట్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదని, రూ. 170 కోట్లు వరకు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని, అది కేంద్రం పథకమేనని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే రాష్ట్రం ఇంకా ముందంజలో ఉంటుందని వ్యాఖ్యానించారు.

Related Posts