పార్లమెంటరీ విధానాన్ని దెబ్బతీయాలని కేంద్రంలోని బిజెపి ప్రయత్నిస్తుంది. దేశంలో, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి అయోగ్ లో ప్రధాని సూచన ప్రమాదకరం. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు జరగాలన్నది ప్రజలు నిర్ణయించాలి. ప్రభుత్వం కాదని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. భారతీయ వైవిధ్యాన్ని నాశనం చేసేలా హిందుత్వ విధానాన్ని అమలుపరిచేలా కేంద్రం వ్యవహరిస్తుంది. ఢిల్లీ లో లెప్టినెంట్ గవర్నర్ వ్యవహారశైలి ఫెడరల్ స్పూర్తి కి విరుద్ధం....ప్రజాస్వామ్యానికి హాని చేసే నియంతృత్వ పోకడలు ఎన్డిఎ ప్రభుత్వం పోతోందని విమర్శించారు. నీతి అయోగ్ స్వతంత్ర ప్రతిపత్తి లేని, ప్రధాని మోడికి గులాంగిరి చేసే సంస్ధ గా మారిపోయింది.. ఫెడరల్ స్పూర్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తాం. అఖిలభారత స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం సిపిఎం గా మేం ఎలాంటి ప్రయత్నం చేయటంలేదు...గతంలో చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. ప్రత్యేక హోదా రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాల్సి ఉంది. మేం అడిగినప్పుడు చంద్రబాబు హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నాడు...ఇప్పుడు హోదా కావాలని అడుగుతున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం డిమాండ్ చేయటం సంతోషమని అన్నారు. ఈవియంల విధానాన్ని సిపిఎం వ్యతిరేకించటంలేదు. అయితే దానికి యంత్రానికి పేపరు ప్రింటింగ్ అనుసంధానించమని కోరుతున్నామని అయనఅన్నారు.