బొమ్మ తుపాకీ అనుకొని పొరబడిన ఓ చిన్నారి సొంత తల్లినే కాల్చింది. తీవ్రగాయాలైన బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఘటన
స్థానికంగా కలకలంరేపింది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం. ఆరాంబాగ్‌కు చెందిన కకోలి జనా అనే చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఆమెకు ఓ తుపాకీ దొరక్కగా దాన్ని
తీసుకొని.. అటు, ఇటు తిప్పింది. ఈ క్రమంలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ నేరుగా ఎదురుగా కూర్చొని ఉన్న ఆమె తల్లి వీపు బాగంలోకి దూసుకెళ్లింది. దీంతో బాధితురాలు
కుప్పకూలింది. వెంటనే ఆమెను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
విచారణ ప్రారంభించారు. చిన్నారిని ప్రశ్నించగా.. తన తల్లికి తుపాకీ దొరికితే తనకు ఇచ్చిందని చెప్పింది. అంతకు మించి ఆమె ఏ సమాధానం చెప్పలేకపోతోంది. చిన్నారి షాక్‌లో ఉందని..
ఆమె ఇప్పుడు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందంటున్నారు పోలీసులు. అయితే ఆ గన్ ఇంటి ఆవరణలోకి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారగా.. గన్ ఫుల్‌గా లోడ్ చేసి ఉండటం కూడా
అనుమానాలకు తావిస్తోంది. బొమ్మ తుపాకీ అనుకొని పొరబడటం వల్లే ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.