YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యలమంచిలి శివాజీని కలిసిన కన్నా

యలమంచిలి శివాజీని కలిసిన కన్నా

గుంటూరు లో మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ గారి నివాసంలో ఆయన ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కలిసారు. ఈ సందర్బంగా అయనకు ప్రధాని నరేంద్ర మోడీ  మొట్ట మొదటిగా పార్లమెంట్ లో అడుగు పెట్టినప్పటి నుండి 4 సంవత్సరాల కాలంలో  ఆయన చేసిన అభివృద్ధి పై రూపోందించిన రోజు పంప్లేట్ ఇచ్చారు. నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు కు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో అనే విషయాలపై నేడు  సీనియర్ రాజకీయ మేధావి యలమంచిలి శివాజీ కలిసి ఇచ్చామని కన్నా అన్నారు.  4 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అవినీతి రహిత పాలన జరిగింది అంటే దానికి నిదర్శనం భారత ప్రధాని మోడీ మాత్రమే. భారతదేశ తెలుగువాడి గౌరవాన్ని నేను  భారతీయ డను అని చెప్పుకునే  స్థాయికి  తెచ్చిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ దని అయన అన్నారు. టీడీపీ నాయకులు స్కామ్ లు  చేస్తారు ,బీజేపీ స్కీమ్ లు అనే విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి  నేడు స్సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తూ ఉన్నాడని అయన విమర్శించారు.  కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చి పథకాలు పంపిస్తే   అవి ఇక్కడకు రాగానే  చంద్రబాబు  ఆయన పేర్లు పెట్టుకొని  మాకు నమ్మక ద్రోహం చేస్తాడని ఆరోపించారు.

Related Posts