దుర్గగుడి ఈవో పద్మ అధ్యక్షతన జరిగిన దుర్గగుడి పాలకమండలి సమావేశంముగిసింది. ఈ భేటీలో చైర్మన్ గౌరంగబాబు, పాలకమండలి సభ్యులుపాల్గోన్నారు. అజెండాలో 14 అంశాలు గాను 13 వాటికి మండలి ఆమోదం తెలిపింది. దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబు మాట్లాడుతూ సిసి కెమెరాలు పనిచేయని వైపు నవ్యశ్రీ మిస్సింగయ్యింది.ఇంద్రకీలాద్రి పై 76 సిసి కెమేరాల్లో 5 మాత్రమే పనిచేయడం లేదని అన్నారు. మహామండపం చెప్పుల స్టాండ్ వద్ద చిన్నారి నవ్యశ్రీ తీసుకెల్తున్న దృశ్యాలు కనిపించకపోవడం వాస్తవమే. కనకదుర్గా నగర్ లో ఉన్న సిసి కెమేరాల ద్వారా నవ్యశ్రీని ఇద్దరు పురుషులు, ఒక మహిళ తీసుకెల్తున్నట్లు సిసి టివి ఫుటేజ్ లో రికార్డయ్యిందని అన్నారు. ఇంద్రకీలాద్రిపై గతంలో ఉన్నటువంటి సిసి టివి కెమేరాల ప్రదేశంలో కొత్తవాటిని మరికొన్ని ప్రదేశాల్లో నిర్మించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందని అయన అన్నారు. కొండపైన సిసి కెమేరాల దృశ్యాలు, రికార్డింగ్, స్టోర్ చేయుటకు అవసరమైన నెట్ వర్క్ విడియో రికార్డర్లు, సర్వర్ల ఏర్పాటుకు కుడా ఆమోదం లభించింది. భవిష్యత్తులో ఇటువంటివి పునరావ్రుతం కాకుండా చర్యలు చేపట్టాం.పోలీసులు రంగంలోకి దిగడంతో పాప ఆచూకి లభ్యమైందని అయనఅన్నారు.