ఈ నెల 27 అర్థరాత్రి నుంచి రాష్టవ్య్రాప్తంగా 1500 బోట్లు వేటకు వెళ్లనున్నాయి. బోట్లలో పనిచేసే క్రూ (సిబ్బందికి) చేపల వేటలో ఇప్పుడు ఇస్తున్న వాటాల్లో మార్పులు చేయబోతున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. గత ఏడాది సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఒక్కో బోటు వేటకు వెళ్లాలంటే, రెండు నుంచి మూడున్నర లక్షల రూపాయలు బోటు యజమానులు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. చేపల వేట సవ్యంగా సాగకపోవడంతో గత ఏడాది నవంబర్ నుంచే రాష్ట్రంలో అన్ని హార్బర్లలో చేపల వేటను నిలిపివేశారు. కేవలం చేపల వేటపైనే జీవనం సాగించే మత్స్యకారులు రోడ్డున పడాల్సి వచ్చింది. కనీసం ఈ సంవత్సరమైనా వేట బాగుండాలని మత్స్యకారలు కోరుకుంటున్నారు. చేపల వేటకు వెళ్లిన క్రూ తీసుకువచ్చిన చేపల్లో కొన్ని మేలు రకాల చేపలను వేరే చేసి, అవి విక్రయించగా వచ్చిన మొత్తంలో 10 శాతం వాటాను క్రూకు ఇస్తున్నామని చెప్పారు. కానీ, ఇకపై అలా ఉండదని అన్నారు. వేటలో దొరికిన అన్ని రకాల చేపలను బోటుల ఉంచిన ఐస్ బాక్స్‌లో ఉంచుతారు. ఇలా ఉంచిన అన్ని రకాల చేపలను విక్రయించి, వచ్చిన మొత్తంలో 10 శాతం ఇవ్వడానికి మూడు సంఘాలు నిర్ణయించాయని సత్యనారాయణ మూర్తి తెలియచేశారు. అలాగే వేట సాగినప్పుడు దొరికిన కొన్ని చేపలను బోటు పైన ఆరబెడతారు. అలా వచ్చిన డ్రై ఫిష్‌లో 80 శాతం క్రూకు ఇవ్వనున్నామని ఆయన తెలియచేశారు. కాకినాడ హార్బర్‌లో మత్స్యకారులు తీసుకువచ్చిని డ్రై ఫిష్‌లో 50 శాతం మాత్రమే క్రూకి ఇస్తున్నారని ఆయన చెప్పారు. దీనివలన బోటు ఓర్లకు నష్టం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఈ వాటాలకు అంగీకరించి క్రూ ముందుకు వస్తే, బోట్లు నడుపుతామని, లేకుంటే నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాదైనా వేటసాగేనా!