YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫుల్ ఆఫర్లతో యాపిల్

ఫుల్ ఆఫర్లతో యాపిల్
యాపిల్ సంస్థ ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్ ఫోన్లపై జీరో డౌన్ పేమెంట్, అతి తక్కువ వడ్డీతో ఈఎంఐ స్కీములను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్లస్, ఐఫోన్ ఎక్స్‌ మోడల్ ఫోన్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ సంస్థ తెలిపింది. దేశంలోని ఆఫ్‌లైన్ రిటైలర్లు అందరి వద్దా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే.. 18 నెలల ఈఎంఐ ప్లాన్స్‌కు మాత్రమే వర్తిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది. జూన్ 15 నుంచి సెప్టెంబరు 30 మధ్య ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దేశంలోని అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా ఐదుశాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆంఫ్ బరోడా, సిటీబ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్‌ ఇండ్, జె అండ్ కె బ్యాంక్, కొటక్ మహీంద్ర, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంక్ తదితర బ్యాంకుల క్రెడిట్ కార్డు వినియోగదారులు కూడా ఆ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని యాపిల్ సంస్థ వెల్లడించింది. 

Related Posts