ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ , మేనేజింగ్ డైరెక్టర్ చందాకొచ్చర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లనున్నారు. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేయడంలో ‘నీకిది-నాకది’కి పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యేవరకు ఆమె సెలవులోనే ఉంటారని సోమవారం సమావేశమైన బోర్డు వెల్లడించింది. బ్యాంకు బీమా వ్యాపార విభాగం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సీఈఓ, ఎండీగా ఉన్న సందీప్ బక్షిని, ఐసీఐసీఐ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా నియమించారు. అయిదేళ్ల కాలానికి పూర్తిస్థాయి డైరెక్టర్, సీఓఓగా బక్షిని నియమించారు. మంగళవారం (ఈనెల 19న) ఆయన బాధ్యతలు చేపడతారు.