పశ్చిమ గోదావరీ జిల్లా పెదవేగి మండలం జానంపేట తమ్మిలేరు అక్విడెక్ట్ వద్ద పట్టిసీమ జలాలను నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణ డెల్టాకు విడుదల చేసారు. ముందుగా జలాలకు జలహారతి మంత్రి దేవినేని ఉమ, ప్రభుత్వ విప్ చింతమనేని జలహారతి ఇచ్చారు. తరువాత మంత్రి మాట్లాడుతూ మూడవ సంవత్సరం 5500 టీఎంసీల నీరు ఇచ్చాం. రూ.10 వేల కోట్ల పంట ఈ నీటి వల్ల బాగుపడింది. ఈ రోజు రాత్రికి కృష్ణా నదిలో గోదారమ్మ కలుస్తుందని అన్నారు. జగన్ మోహన్ రైతులను రెచ్చకొట్టే ప్రయత్నం చేశారు. నా దిష్టిబొమ్మ తగలపెట్టమన్నాడు, ప్రభుత్వం అంతు చూస్తానని తిరుగుతున్నాడు.చంద్రబాబు పోలవరం సినిమా చూపిస్తున్నారు అని జగన్ కడుపు మండి హేళన చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వస్తే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలో పోలవరం ప్రాజెక్టు పనులు ఆన్ లైన్ లో పెడుతున్నాం. 8500 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 1400 కోట్లు కేంద్రం నుండి వస్తాయని మంత్రి అన్నారు.