YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చీరాలలో మంత్రి నారా లోకేష్ పర్యటన

చీరాలలో మంత్రి నారా లోకేష్ పర్యటన
మంత్రి నారా లోకేష్  మంగళవారం నాడు చీరాలలో  పర్యటించారు. కొణిజేటి చేనేతపురి లో  రూ 1 కోటి 34 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు,9 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం,9 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసారు. తరువాత అక్కడి చేనేత కార్మికులతో మంత్రి ముఖాముఖి మాట్లాడారు. అయన మాట్లాడుతూ అన్ని గ్రామాలకు 10 స్టార్ రేటింగ్ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి  ఆదేశించారు. అందులో ముఖ్యమైనది ప్రతి కుటుంబానికి నెలకి పది వేల రూపాయిలు ఆదాయం కల్పించడం. దీనిలో భాగంగా చేనేతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చేనేత రైతు రుణాలు మాఫీ చేసాం. చేనేత వృద్దాప్య పెన్షన్లు ఇస్తున్నాం. అరకు కాఫీ కి ఏ విధంగా బ్రాండ్ క్రియేట్ చేసామో అలానే చీరాల చేనేత కు కూడా అలాంటి బ్రాండ్ క్రియేట్ చేస్తాం. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల పెళ్లిలకు బట్టలు పెడతాం. ఆ బట్టలు చీరాల నుండే వస్తాయి. 2014 లో హేతు బద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించి మనల్ని కట్టు బట్టలతో బయటకి గెంటేసారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు బీజేపీ నమ్మక ద్రోహం చేసింది..ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. 16 వేల కోట్లు లోటు ఉన్నా రైతు రుణమాఫీ,24 గంటల విద్యుత్,డ్వాక్రా రుణమాఫీ చేసాం . నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. 2019 ఎన్నికల్లో 25 కి 25 పార్లమెంట్ సీట్లు గెలిచి హోదా సాధిస్తామి అన్నారు. అనంతరం చేనేత కార్మికులకు పెన్షన్లు అందజేసారు. 

Related Posts