ఐఏయస్ అధికారులు అంటే ఏసిలలో కూర్చుని పరిపాలిస్తారని అపోహ అందరిలో ఉన్నదని కానీ మండుటెండలో కాల్వగట్టులపై తిరుగుతూ పట్టిసీమ ప్రాజెక్టు 9 నెలల కాలంలో పూర్తి చేయడంలో ధమ్ము ధైర్యం ఉన్న ఏకైక కలెక్టరు డా. కాటంనేని భాస్కర్ అని అటువంటిఅధికారిని ప్రశంసించడం అభినందించడం మన కర్తవ్యమని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ పశ్చిమ కలెక్టరుపై ప్రశంసల జల్లు కురిపించారు. పెదవేగి మండలం జానంపేట వద్ద జలహారతి కార్యక్రమం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమర్ధులైన జిల్లా కలెక్టరు డా. కాటంనేని భాస్కర్, అహర్నిశ కృషి నేడు మంచి ఫలితాలను అందిస్తున్నదన్నారు. పట్టిసీమ విషయంలో ఎ ంతో ధమ్ముగా జిల్లా కలెక్టరు డా. కాటంనేని భాస్కర్ రాత్రిబవళ్లు ఎ ంతోశ్రమపడి పనిచేసారన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా జిల్లా కలెక్టరు డా. కాటంనేని భాస్కర్ ఎ ంతో పారదర్శకంగా పనిచేసారని ఈసందర్భంగా దేవినేని ఉమ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ కూడా పట్టిసీమ ప్రాజెక్టు కోసం ఎ ంతోకష్టపడ్డారన్నారు. భార్యప్రాణాలను కూడా లెక్కచేయకుండా పట్టిసీమ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి వద్దకు రైతులను తీసుకువెళ్లిన ఘనత చింతమనేనికి దక్కుతుందన్నారు. ఈకార్యక్రమంలో పెదవేగి యంపిపి దేవరపల్లి బక్కయ్య, ఆదర్శరైతు పర్వతనేని బాలగంగాధరతిలక్ (బాబ్జి), తదితరులు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో ఎ యంసి ఛైర్మన్ మాగంటి సురేంధ్రనాధ్ చౌదరి, రాట్నాలమ్మ దేవాలయ ట్రస్టు ఛైర్మన్ రాయల భాస్కర్, రమేష్, యంపిపి మోరు శ్రావణి, పప్పల సుశీల, జలవనరుల శాఖ యస్ఇ రఘునాధ్, పలువురు నీటి సంఘ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎ త్తున పాల్గొన్నారు.