YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

భారత్‌లో బాలికల విద్యకు కృషి చేస్తా.. పాకిస్థాన్ ధీర వనిత యూసుఫ్ జాయ్ మలాలా

భారత్‌లో బాలికల విద్యకు కృషి చేస్తా.. పాకిస్థాన్ ధీర వనిత యూసుఫ్ జాయ్ మలాలా

- గుల్మాకై నెట్‌వర్క్-మలాలా ఫండ్ భారత్‌కు విస్తరించడం సంతోషం

-  నోబుల్ శాంతి బహుమతి గ్రహీత పాకిస్థాన్ ధీర వనిత యూసుఫ్ జాయ్ మలాలా

భారతీయుల నుంచి ఎంతో అభిమానం, మద్దతు పొందానని, ఆ దేశ పర్యటనకు వెళ్లాలని కోరుకుంటున్నానని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్ ధీర వనిత యూసుఫ్ జాయ్ మలాలా అన్నారు. భారత్‌లో బాలికల విద్యకు కృషి చేస్తానని చెప్పారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆమె పాల్గొన్నారు. బాలికల విద్యకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రపంచ దేశాల నేతలను, సీఈవోలను మలాలా కోరారు. ఓ వార్త సంస్థతో ఆమె మాట్లాడుతూ.. తాలిబన్లకు వ్యతిరేకంగా, బాలికల విద్యాభివృద్ధికి కోసం తాను నెలకొల్పన గుల్మాకై నెట్‌వర్క్-మలాలా ఫండ్ భారత్‌కు విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. 

Related Posts