YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కశ్మీర్ లో కటీఫ్

కశ్మీర్ లో కటీఫ్
జమ్ముకశ్మీర్‌లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది బీజేపీ. పీడీపీతో కలిసి సాగడం ఇక బీజేపీ వల్ల కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, జమ్ముకశ్మీర్ ఇన్‌చార్జ్ రాంమాధవ్ వెల్లడించారు. బీజేపీ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డంతో సీఎం ప‌ద‌వికి మెహ‌బూబా ముఫ్తీ రాజీనామా చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం, హింస పెరిగిపోయిందని, పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిందని రాంమాధవ్ విమర్శించారు. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. దేశ సమ‌గ్ర‌త‌, ప్ర‌యోజ‌నాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో అధికారాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాంమాధ‌వ్ స్ప‌ష్టంచేశారు.జమ్మూ-కశ్మీరు రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. కశ్మీర్లో నానాటికీ హింస పెరిగిపోతుండటం, పీడీపీతో దూరం పెరుగుతుండటంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్లోని సంకీర్ణ సర్కారుకు మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించింది. ఢిల్లీలో జమ్మూ కశ్మీర్‌కి చెందిన బీజేపీ మంత్రులు, పార్టీ నేతలతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొగాలని నిర్ణయించారు. బీజేపీ నిర్ణయంతో మూడేళ్ల ముఫ్తీ సర్కారు కుప్పకూలి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. కశ్మీర్ లోయలో హింస, ఉగ్రవాదం పెరుగుతోంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. శ్రీనగర్లో పత్రిక ఎడిటర్‌ను హత్య చేశారు. కేంద్రం కశ్మీర్లో అనేక ప్రాజెక్టులను అమలు చేసింది. రూ.80 వేల కోట్లను అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించింది. ఇటీవలే ప్రాజెక్టుల విషయమై ప్రధాని లడఖ్‌లో పర్యటించారు. భద్రత కోసం కేంద్రం హోం శాఖ రాష్ట్రానికి పూర్తి అండగా ఉంటోంది. పీడీపీ మూడేళ్ల పాలనలో జమ్మూ, లడఖ్ ప్రాంతాల ప్రజలు వివక్షకు గురువుతున్నట్టు భావిస్తున్నారు. కశ్మీరీల సమస్యలను పరిష్కరించడంలో మెహబూబా సర్కారు విఫలమైంద’ని బీజేపీ నేత రామ్ మాధవ్ తెలిపారు 

Related Posts