YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఎంపీ దత్తాత్రేయ భేటీ

 కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఎంపీ దత్తాత్రేయ భేటీ
కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ ని ఎంపీ  బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు కలిసారు. తరువాత ఆ వివరాలు మీడియాతో పంచుకున్నారు. రాజనాధ్ సింగ్ తో తెలంగాణ ఏపీలో రాజకీయ పరిసితులపై పై చర్చించా. శాంతి భధత్రాలు,నక్సలైట్,పలు అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించాం. ఏపీ తెలంగాణ హైకోర్టు ఏర్పాటు అంశాన్ని రాజ్ నాధ్ తో చర్చించానని అన్నారు. హైకోర్టు ఏర్పాటు అంశం న్యాయ శాఖ పరిధిలో ఉందని హోంమంత్రి తెలిపారు. తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటి వరకు పంచాయితీ రాజ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదని అయనఅన్నారు. సకాలంలో ఎన్నికలు జరగాలి జరుగుతాయి అనే నమ్మకం కలగడం లేదు. గ్రామ పంచాయితీలో ప్రజలకి అధికారం ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదని అయన అన్నారు. టిఆర్ఎస్ బీజేపీకి ఎక్కడా ఒప్పందం లేదు. ఫెడరల్ ఫ్రంట్ ఆచరణలో సాధ్యం కాదు. అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయాలకోసం అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కెసిఆర్ కి దూరంగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణాలో ఒంటరిగానే అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని అన్నారు. రైతు బంధు పథకం రైతులకు ఉపశమనం మాత్రమే. తెలంగాణాలో గ్రామాల వారిగా లబ్ధిదారుల పేర్లను వెబ్ సైట్ ద్వారా బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. 

Related Posts