YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎవ్వరికి పట్టని వాల్టా చట్టం

ఎవ్వరికి పట్టని వాల్టా చట్టం
జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. వందల వాహనాల్లో ఇసుక రాంగ్ రూట్‌కు తరిలిపోతుంది. అనుమతులు ఒక చోటైతే ఇసుక డంపింగ్‌లు మరో చోట ఉంటున్నాయి. వేబిల్లులను అడ్డం పెట్టుకొని అక్ర మార్కులు దందాను కొనసాగిస్తున్నారు. ఒక వేబిల్లు మీద నాలుగు మార్లు ఇసుకను తరిలించుకుం టున్నా రు. జీరోగా దొరకకుండా మరుగుదొడ్ల సాకు కింద మంజూరు చేసుకుంటూ ఇసుక కొందరు పక్కదారి పట్టిస్తున్నారు.  వారం రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ప్రభుత్వ శాఖ నుండి అనుమ తులు పొందుతూ క్వారీ నుండి ఇసుకను రవాణా చేసుకుంటున్నారు. ఇసుకాసురులు కొందరు ఈ వ్యాప కానికి పాల్పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం కొందరు, ప్రభుత్వ పనుల పేరిట మరి కొందరు ఇసుకకు చాలన్లు చెల్లించి వారి కనుసన్నల్లో ఇసుకను పక్కదారి పట్టించే దారులు వెతుక్కుంటున్నారు.నిజా మాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఎక్కువగా బీర్కూర్ మండల శివారులోని మంజీరా నుండి ఇసుక తరలిపోతుంది. అదే విధంగా కిష్టాపూర్ క్వారీ నుండి కూడా ఇసుకను తరిలించుకుం టున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల గుండా ఇసుకను తరలిస్తున్నారు. అధిక లోడుతో ఇసుకను నింపుకుం టూ అక్రమ దారి పడుతున్నారు. నిబంధనలకు తిలో దకాలిస్తూ వారికి అనుకూలంగా ఇసుకను రవాణా చేసుకుంటున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడం తో ఇసుక వ్యాపారులకు ఆడిందే ఆట…పాడిందే పాట గా నడుస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో ఇసుక వాహనాలు రోడ్డుకెక్కుతున్నాయి. అనుమతులు ఒక దిక్కైతే రవాణా మరో దిక్కు అవుతోంది. ఎక్కువ సంఖ్య లో వాహనాలు రాంగ్ రూట్ పడుతున్నాయి. మండల స్థాయిలో అధికారులకు తెలిసినా ఎవరూ ఏమీ పట్టిం చుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ మాత్రం ఇసుక అక్రమ రవాణాజరిగితే అందుకు అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించినప్పటికీ పని తీరులో మార్పు కనిపించడం లేదు. ఇసుక అక్రమ రవాణా దారులతో మిలాఖత్ కావడం వల్ల ఈ తరహ ప్రక్రియ చోటుచేసు కుంటుంది.అక్రమ ఇసుక రవాణా వెనుక అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. వారి అండదండలతోనే ఇసుక అక్ర మ రవాణాదారులు తెగ రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ పద్దతి కూడా వారికి బాగా కలిసొస్తుంది. బీర్కూర్, బిచ్కుంద, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక సంగారెడ్డి, హైదరాబాద్, తది తర ప్రాంతాలకు తరలిపోతుంది. ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఆ ప్రాంతానికి చెందిన వాటిలోనే ఇసుక రవాణా అవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం అను మతులు మాత్రం పక్కాగా మరుగుదొడ్లు, ప్రభుత్వ ప్రగతి పనులకు మాత్రమేనన్న గణాంకాలు చూపుతు న్నాయి. మండల స్థాయి అధికారులు కూడా అందుకు వంత పాడుతూ వాటి పేరిట వేబిల్లులను మంజూరు చేస్తున్నారు.అందులో వాహనానికి ఒక ట్రిప్పు మాత్ర మే కేటాయించినట్లు చూపిస్తూ అదే వేబిల్లు పేరిట నాలుగైదు ట్రిప్పుల ఇసుకను క్వారీ నుండి బయటకు తీసుకు వస్తున్నారు. అనుమతికి మించి ఇసుకను వాహ నాలలో నింప రాదన్న ఖచ్చితమైన నిబంధనలు అమ లులో ఉన్నప్పటికీ వాటిని దిక్కరిస్తూ ఓవర్ లోడ్‌తో ఇసుకను తీసుకుపోతున్నారు. రెవిన్యూ, పోలీసు శాఖ అధికారులు కూడా అటు దిశగా దృష్టి సారించలేకపో తున్నారు. వాల్టా చట్టం అమలులో ఉన్నా ఎవరికీ పట్టి ంపులేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా దారులకు కాసుల సిరులను కురిపిస్తున్నాయి. తిలా పాపం…తలా పిడికెడు అన్న చందంగా ఇసుక అక్రమ దందా కొన సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ వేస్తే తప్ప అక్రమార్కులకు అడ్డు అదుపు ఉండదు. అందుకు మైన్స్ అధికారులు మేలుకోవాల్సిందే.

Related Posts