YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రాంతీయ పార్టీల బంధానికి బాటలు

ప్రాంతీయ పార్టీల బంధానికి బాటలు
ప్రధాని మోడీని ఎదుర్కోగల నేత ఎవరూ లేరన్నది బీజేపీ నేతల మాట. అయితే.. నీతి ఆయోగ్ వారి వాదనను నీరుగార్చేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ లెవల్ లో తన సత్తా ఏంటో నీతి ఆయోగ్ మీటింగ్ లో రుచిచూపించారని వ్యాఖ్యానిస్తున్నారు. టోటల్ గా మోడీని సమర్ధవంతంగా ఎదుర్కొనే నేతగా.. ఏపీ సీఎం ఫోకస్ అయ్యారని అంటున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల లీడర్లతో ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీ సీఎం దీక్షకు మద్దతు తెలిపారు. మొత్తంగా.. దేశ రాజధానిలో ఉన్న సమయమంతా.. ప్రాంతీయ పార్టీల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు కేటాయించారు. మరోవైపు నీతిఆయోగ్ మీటింగ్ లో చంద్రబాబు స్ఫూర్తితో.. బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం కేంద్రంపై సీరియస్ గానే స్పందించారు. నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదంతా.. చూస్తుంటే.. బీజేపీకి వ్యతిరేకంగా.. కూటమిని ఏకతాటిపైకి తీసుకురావడంతో.. చంద్రబాబే కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా ఉందని.. రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నేతృత్వం వహించే నేత ఎంపికలో ఆయనదే కీ రోల్ అని చెప్తున్నారు.
 
40ఏళ్ల పొలిటికల్ కెరీర్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయాలే కాదు.. పరాజయాలూ పలకరించాయి. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. పరాజయం వచ్చినప్పుడు కృంగిపోలేదు. తమ పార్టీని బలోపేత చేస్తూ.. ప్రజాసేవకే అంకితమయ్యారు. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. నిజమైన లీడర్ అనిపించుకున్నారు. జాతీయస్థాయిలోనూ చక్రం తిప్పారు. చంద్రబాబు నాయుడు అంటే.. నేషనల్ లెవల్ పాలిటీలో విపరీతమైన ఆసక్తి. ఇలాంటి క్వాలిటీలు ఉన్న నేత అధినేతగా ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేయడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంతోనే కాషాయదళం ఖంగుతింది. అందుకే వచ్చేఏడాది దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లోనూ ఈ వర్గం కలిసికట్టుగా ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ జోరందుకుంది. దీంతో బీజేపీలో టెన్షన్ మొదలైపోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 

Related Posts