అనిల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ 'తోడల్లుళ్లు'గా కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నెల 30 వ తేదీన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. వరుణ్ సరసన మెహరీన్ జోడి కడుతుంది.