YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఖరీఫ్ వైపు రైతుల అడుగులు

ఖరీఫ్ వైపు రైతుల అడుగులు
గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలు సాగువైపు మళ్లుతున్నారు. నిన్నమొన్నటి వరకు వేసవిలో విశ్రాంతి తీసుకున్న రైతులు సకాలంలో చెదురు మదురు వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. దుక్కులు దున్ని, విత్తనాలు విత్తేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కృష్ణా, పశ్చిమ డెల్టాల్లో నారుమడులు పోసేందుకు సిద్ధమవగా గుంటూరు, నరసరావుపేట, గురజాల డివిజన్లలో మెట్ట ప్రాంతాల్లో పత్తి, మినుము, పెసర వంటి పంటలు వేసేందుకు సంసిద్ధులయ్యారు. ప్రధానంగా రెండు రోజుల క్రితం పట్టిసం ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను కృష్ణాకు మల్లించడం డెల్టా రైతాంగంలో ఆశలు రేపింది. గత ఏడాది కంటే మూడు రోజుల ముందుగానే గోదావరి జలాలు కృష్ణాకు వదలడంతో ఈ ఖరీఫ్‌లో కూడా సకాలంలో నాట్లు పడనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 5,35,214 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా, గత ఏడాది 5,38,748 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో కృష్ణాపశ్చిమ డెల్టా కింద 2 లక్షల హెక్టార్లకు పైగా వరిసాగు చేశారు. ఈ ఏడాది కూడా పట్టిసీమ నుండి నీరు విడుదల చేయడంతో అదేస్థాయిలో సాగు అవుతుందన్నది అధికారుల అంచనా. ఇలా ఉండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాల్వ కింద పల్నాడు ప్రాంతంలో దాదాపు 90 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. అయితే గడిచిన నాలుగు సంవత్సరాలుగా సరిపడా సాగునీరు అందకపోవడంతో ఆరుతడి పంటలు, వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే సాగర్ డ్యామ్‌లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకోవడం, ఇప్పటివరకు ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసిన దాఖలాలు లేకపోవడంతో రైతాంగం ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. 

Related Posts