- కేవలం తొమ్మిది గంటల్లోనే ఒక రైల్వేస్టేషన్‌ను నిర్మించింది
- హైస్పీడ్ రైల్వే వ్యవస్థకు 247 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టు
డ్రాగన్ కంట్రీ చైనా మరో రికార్డును సృష్టించింది. కేవలం తొమ్మిది గంటల్లోనే ఒక రైల్వేస్టేషన్‌ను నిర్మించింది. మొత్తం 1500మంది రైల్వే సిబ్బందితో ఈ నెల 19న లాంగ్యాన్ పట్టణంలోని నాన్‌లాంగ్ రైల్వే స్టేషన్‌ను చైనా నిర్మించింది. ఆ దేశంలోని ప్రధాన రైల్వేలైన గాంగ్‌లాంగ్ రైల్వే, గాన్‌రుయిలింగ్ రైల్వే, ఝాంఘ్‌లాంగ్ రైల్వేలను ఈ స్టేషన్ అనుసంధానం చేయనుంది.
దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా 247 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం రూ. 7 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మించిన లాంగ్యాన్ అందులోని భాగమే. ఈ స్టేషన్ నిర్మాణం వల్ల మధ్య-ఆగ్నేయ చైనాల మధ్య ఉన్న 7 గంటల ప్రయాణ దూరం ఇ