అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో నిర్వహిస్తున్న స్టైఫండరీ కే డెట్ ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ల పాసింగ్ ఔట్ పెరేడ్ లో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, డిజిపి మాల కొండయ్య, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, అనంతపురం ఎమ్మెల్యే వి.ప్రభాకర్ చౌదరి, నగర మేయర్ స్వరూప ఇతర పోలీస్ అధికారులు పాల్గోన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పెద్ద ఎత్తున పోలీస్ నియామకాలు జరిగాయి. 5866 పోలీస్ కానిస్టేబుల్స్,, 652 ఎస్సై లను నియమించాం. రాష్ట్రంలో 19 కేంద్రాల్లో వీరికి శిక్షణ ఇచ్చి 42 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. సామాన్యునికి న్యాయం చేయాలన్నదే ముఖ్య మంత్రి ధ్యేయం..ఆ దిశగా శిక్షణ పొందిన పోలీస్ లు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు.