ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా తూర్పు ప్రధాన కాలువపై కొత్తగా నిర్మించిన నియంత్రిక ద్వారా చంద్రబాబు స్విచ్ ఆన్ చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పనుల పైలాన్ను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కృష్ణా కాలువలో చంద్రబాబు గంగ పూజ నిర్వహించారు. కృష్ణా డెల్టాలోని 7.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. గత ఏడాది కంటే వారం ముందుగానే నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కార్యక్రమంలో త్రి దేవినేని ఉమ, మండల బుద్ధప్రసాద్, బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న పాల్గొన్నారు. నీటి విడుదల సందర్భంగా సర్వ మత ప్రార్థనలు జరిపారు. చంద్రబాబు మాట్లాడుతూ 7,36,537ఎకరాల సాగు భూమికి తూర్పు డెల్టా కాల్వ ద్వారా నీటి విడుదల అవుతున్నట్లు వెల్లడించారు. పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా 5600 కూసెక్ ల గోదావరి జలాల మళ్ళింపు జరిగిందని అన్నారు. వరుసగా ఐదో ఏడాది కూడా జూన్ లోనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసినట్లు అయన అన్నారు. గత ఏడాది కృష్ణా డెల్టాలో 100శాతం సాగు. అయింది. తూర్పు డెల్టా పరిధిలో నాలుగు కాల్వలు వున్నాయి. రైవస్ కాల్వ పరిధిలో 3.30లక్షల ఎకరాలు, బందరు కాల్వ ద్వారా 1.50లక్షల ఎకరాలు, కేఈబీ కెనాల్ ద్వారా 1.38లక్షల ఎకరాలు, ఏలూరు కాల్వ ద్వారా లక్షా 15 వేల ఎకరాల సాగు అవుతుందని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టా చివరి ఆయకట్టుకు, ఆక్వా సాగుకు నీరు లభ్యం అవుతుందని అన్నారు.