రాష్ట్రంలో3లక్షల మంది యువతకు ఐ. టి రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికిచర్యలు తీసుకున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐ.టీ శాఖామంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఐ.టి కంపెనీలు స్థాపించడానికి కియో మోటార్స్,హే.సి.ఎల్.కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతిప్రతి నెల1000 రూపాయలు కల్పించడానికి బడ్జెట్ లో1200 కోట్ల రూపాయలు కేటాయించడము జరిగిందన్నారు.రాష్ట్రంలో16 వేల కోట్ల రూపాయలులోటు బడ్జెట్ లొ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో50లక్షల పెన్షన్లు ఇస్తే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ లో 50లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్రం ప్రభుత్వం సహకరించనప్పుటికి ,లోటు బడ్జెట్ అయినప్పటికీ 24 వేల కోట్ల రూపాయల తో రైతురుణమాఫీ అమలు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో25 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్డులు నిర్మిచడానికి చర్యలు తీసుకున్నామన్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో 17 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్డులు నిర్మించామన్నారు. రాబోయే సంవత్సరం లో8 వేల కిలో మీటర్లు సిమెంటు రోడ్డులు నిర్మిస్తా మన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అంగన్ వాడి భవనాలు, పంచాయతీ బిల్డింగ్స్,ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళ్లాయి ,ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఎల్.ఈ.డీ. బుల్బ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.ప్రకాశము జిల్లాలో త్రాగునీటి సౌకర్యాలు కల్పించడానికి వాటర్ గ్రిడ్ పథకం కింద2900 కోట్ల రూపాయలు కేటాయించడము జరిగిందని మంత్రి తెలిపారు. చీరాల నియోజకవర్గ పరిధిలో తారు రోడ్లు నిర్మాణం కోసం10 కోట్ల రూపాయలు మంజూరు చేశా మన్నారు.చీరాల నియోజకవర్గ పరిధిలో 24 గ్రామ పంచాయతీల్లో రోడ్డులు పూర్తి చేయాడానికి 72 కోట్ల రూపాయల అవసరమని ఎమ్మెల్యే కోరారని దశల వారీగా అన్ని రోడ్డులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.