రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. భారతీదేశంలో ఆంధ్రప్రదేశ్ ను రెండు అంకెల అభివృద్ధి లో
నిలిపారన్నారు. రాష్ట్రంలో 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ని ముఖ్యమంత్రి 4 సంవత్సరాలల్లో చేసి చూపారన్నారు.రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 3500 కోట్ల రూపాయల తో సిమెంటు రోడ్డులు నిర్మించడా ని మంత్రి చర్యలు చేపట్టారన్నారు .. ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు రైతుల సమస్యలు పై తక్షణమే స్పందించాలని అయన అన్నారు.రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంట్రవెన్షన్ పధకం క్రింద 500 కోట్ల రూపాయలు నిధులు ఉన్నా యన్నారు. .రైతులు పండించిన కందులు,శనగలకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి వాటిని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ పరిధిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు 10.35 కోట్లు రూపాయల చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం కొత్తపేట జిల్లా పర్షిత్ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తో మంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల లో అవసరమైన సౌకర్యాలు గురించి మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారన్నారు.