YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కూపీ లాగుతున్నారు

కూపీ లాగుతున్నారు
తెలుగు చిత్రసీమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఎప్పుడు ఎవరిపై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ విషయమై ఒకపక్క చర్చలు సాగుతుండగానే అమెరికాలో తెలుగు దంపతులు నడిపిస్తున్న వ్యభిచార దందా వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి ఉలిక్కిపడింది. ఈ కేసును అమెరికా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాక ఆదేశ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రముఖ హీరోయిన్ చ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న ఎఫ్బీఐకి ఊహించని విధంగా సెక్స్ రాకెట్ కి సంబంధించిన కీలక వివరాలు తెలియడంతో దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసలు యూఎస్ కి ఇండియా నుంచి సినీ హీరోయిన్లు ఏ పనిమీద వస్తున్నారు. ఎన్నాళ్లు అక్కడ ఉంటున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు లాంటి డీటైల్స్ ని తవ్వితీసే పనిలో ఎఫ్ బీఐ నిమగ్నమైంది. అమెరికాలో ఓ ప్రముఖ తెలుగు హీరోయిన్  పై సెక్స్ రాకెట్ సూత్రదారులు కిషన్, చంద్రకళ భౌతిక దాడి చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది. అక్కడ ఎమెర్జెన్సీ నెంబర్ 911 కి ఆ హీరోయిన్ కాల్ చేసి కిషన్, చంద్రకళపై ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎఫ్ బీ ఐ. మొత్తం కూపీ లాగింది. అసలు కంప్లైట్ చేసిన హీరోయిన్ ఎందుకొచ్చింది. కిషన్, చంద్రకళ ఎలా పరిచయం ....వాళ్ల బయోడేటా ఎంటి .. అన్నింటినీ ఆరా తీసింది. ఈ క్రమంలోనే భారీ సెక్స్ రాకెట్ బయటపడింది.  
ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్న అమెరికా దర్యాప్తు సంస్త  ఇప్పటికే సెక్స్ రాకెట్ సూత్రదారులు చంద్రకళ, కిషన్ లను ప్రశ్నించింది. అమెరికాలో స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెట్టారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలతో పాటు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన వారు కూడా హడలిపోతున్నారు. చంద్రకళ, కిషన్ లు  అప్రూవర్స్ గా మారుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే అక్కడ తక్కువ శిక్ష పడే అవకాశముండడంతో అప్రూవర్ గా మారి విచారణాధికారులకు సహకారించనున్నట్లు తెలుస్తోంది. ఇక వాళ్లే గనుక అప్రూవర్స్ గా మారితే అమెరికాలో తెలుగు సంఘాల కీలక నేతల జీవితాలు వారి తెరవెనుక బూతు బండారాలు బయటపడనున్నాయి.  దీంతో ఆటా,  నాటా లోని కీలక నేతలు  హడలెత్తిపోతున్నారు. ఎంతో ప్రెస్టీజియస్‌గా జీవిస్తున్నతమ పరవు ఏమవుతుందోన్న కలవరం వారిలో కనిపిస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టైన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది తేలాల్సి వుంది. 

Related Posts