ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏపార్టీతో పొత్తులు పెట్టుకోదు. ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాం. కాంగ్రెస్ ప్రజలతో మాత్రమే పొత్తుపెట్టుకుంటుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ అన్నారు. బుధవారం నాడు అయనమీడియాతో మాట్లాడారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తున్న పిసిసి నేతలను రాహుల్ అభినందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్ళు ఇస్తామని గత కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని బిజెపి అడిగింది. బిజెపి అధికారం లోకి వచ్చాకా అడిగినఅంశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏపీ ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. యూపీఏ అధికారం లోకి వస్తే ప్రత్యేక హోదా ఫైలుపై మొదటి రోజు రాహుల్ సంతకం చేస్తారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ మాత్రమే నిజం చేస్తుంది. ఏ ఇతర పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం మా ఎజెండాలో లేదు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారిని తిరిగి ఆహ్వానిస్తున్నాం. ఏ పార్టీతో పొత్తులు లేవు ..కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మా లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఏపీ పిసిసిలో ఎటువంటి మార్పులు లేవని అన్నారు.