ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ వివాదాస్పద
కోళ్లకు సహజంగా కొట్టుకునే గుణం ఉందని, ఒకదానికొకటి తారసపడగానే సహజసిద్ధంగా కొట్టుకుంటాయని.. అలా కొట్టుకున్న సమయంలో నలుగురు గూమికూడుతారన్నారాయని కోడి పందాలపై ప్రభుత్వ విప్, టీడీపీ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొత్త భాష్యం చెప్పారు. అలా కొట్టుకునే కోళ్లను సుప్రీంకోర్టు ఆపలేదని, మనుషులైతేనే ఆపగలమంటూ ఆయన చెప్పుకొచ్చారు. కోడి పందాల నిర్వాహణకు హై కోర్టు నో చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. జంతు హింస, జూదాన్ని సహించేది లేదంటూ తేల్చి చెప్పింది కోర్టు. దీనిపై బీజేపీ నేత రఘురామా కృష్ణంరాజు సుప్రీమ్ కోర్ట్ తలుపు తట్టారు. పందాలు జరగకుండా చూడాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. అయితే హైకోర్టు ఆంక్షలు విధించినా…సుప్రీం తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని రఘురామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా సుప్రీం కోర్టు హై కోర్టు నిర్ణయంపై స్టే ఇచ్చింది.