YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంగన్‌ వాడీలపై సిఎం చంద్రబాబు వరాల జల్లు ..!!

 అంగన్‌ వాడీలపై సిఎం చంద్రబాబు వరాల  జల్లు ..!!

 రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో తన నివాసంలోని ప్రజాదర్భార్‌ హాలులో సాధికార మిత్రలతో జరిగిన సమావేశంలో ఆయన అంగన్‌ వాడీలపై వరాల జల్లు కురిపించారు. 7500లుగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్ల పైచీలుకు భారం పడుతుందని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండోసారి అంగన్‌వాడీల వేతనాలను పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలోనే అంగన్‌వాడీలందరికీ స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒక్క ఆడపిల్లా చనిపోవడానికి వీల్లేదన్నారు. గర్భిణులు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శిశుమరణాల సంఖ్య తగ్గిందన్నారు. కేరళతో పోల్చి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉందని తాను అభిప్రాయపడుతున్నానన్నారు. చిన్న పిల్లలు చనిపోకుండా ఉండాలనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.. ప్రభుత్వ ఆస్పత్రిల్లో డెలివరీల సంఖ్య పెరగడంతో పాటు పిల్లలకు టీకాలు వేసే విధానంలోనూ ఇంకా మెరుగుదల రావాలని సూచించారు.

Related Posts