టీడీపీ ప్రభుత్వం, నేతలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. టీడీపీ నేతలు అవినీతిలో పోటీ పడ్డారే తప్ప.. అభివృద్ధిలో కాదని అన్నారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మంత్రి వరకు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని, బాబు కుమారుడికి తప్ప ఎవ్వరికీ జాబు రాలేదని విమర్శించారు. చంద్రబాబు మోసం చేయటానికి ఒక్క కులం కూడా మిగల్లేదన్నారు. అన్నం పెట్టిన చేతిన నరకటం చంద్రబాబు సహజ గుణం అని విమర్శించారు. సాయం చేసిన మోదీని మోసం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.