YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోదావరి జిల్లాలపై దృష్టి

గోదావరి జిల్లాలపై దృష్టి
సన్నిహితుల సలహా, సూచనలా? లేక విమర్శకుల నుంచి వస్తున్న వ్యాఖ్యల ఫలితమో కానీ వైసిపి చీఫ్ తన ప్రసంగం స్టయిల్ మార్చారు. వైసిపి అధికారం చేపట్టి తాను ముఖ్యమంత్రిని అయితే అనే జగన్ ఇప్పుడు పంథా మారిపోయింది. దేవుడు ఆశీర్వదించి, మీరందరు తోడుగా వచ్చి దీవిస్తే మన ప్రభుత్వం వస్తుంది అంటున్నారు జగన్. దాంతో నేను… మేము నుంచి మనం అనేది ఆయన తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న పాదయాత్ర బహిరంగ సభల్లో వింటున్నాం. జగన్ లో వచ్చిన ఈ మార్పుకి వైసిపి శ్రేణులు సంబరపడుతున్నాయి. గతంలో జగన్ తరచూ నేను సీఎం అయ్యాక అనే మాటను మానేసి మన ప్రభుత్వం అనే మాటను వాడటం తో జనం బాగా కనెక్ట్ అవుతున్నారు.ప్రతి నియోజకవర్గంలోని సమస్యలను జగన్ తన పాదయాత్రలో ఆకళింపు చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో గతంలో వైఎస్ చేసిన మంచి పనులను ప్రస్తావిస్తున్నారు. వైసిపి అధికారంలోకి వస్తే చేయబోయే పనులు చెబుతున్నారు. ఇక ప్రసంగాల్లో అయితే ప్రత్యేకించి ఆయా ప్రాంతాల అభివృద్ధి, సమస్యలు, పరిష్కారాలను చక్కగా ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రతి ప్రాంతంపై వైసిపి చీఫ్ కి మంచి పట్టు దొరుకుతుంది. తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే రాజమండ్రి లో వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు. ఆ తరువాత బాబు నాలుగేళ్ల పాలనలో జరిగిన లోటుపాట్లు ఎత్తి చూపారు. ఆ తరువాత జరిగిన రావులపాలెం, పి. గన్నవరం తాజాగా జరిగిన రాజోలు సభల్లో స్థానిక సమస్యలపై చక్కటి విశ్లేషణ చేశారు. అరటి రైతుల గిట్టుబాటు ధరల నుంచి పూతరేకులు, మామిడితాండ్ర, పచ్చళ్ళ కుటీర పరిశ్రమలపైనా, గీతకార్మికులు, మత్సకారుల, స్వర్ణకారులు, వడ్రంగి, కుమ్మరి వృత్తి పనివారు ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా ప్రస్తావించి ఆయా వర్గాలను ఆకట్టుకున్నారు.వైసిపి తీవ్రంగా నష్టపోయింది గోదావరి జిల్లాలోనే. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు దక్కకపోగా పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ టిడిపి బిజెపి ఖాతాలోకి పోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, రంపచోడవరం వైసిపి గెలిచినా 14 సీట్లు టిడిపి బిజెపి కూటమి దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల సమస్యలు వాటి పరిష్కారాలపై జగన్ తీవ్రంగానే కసరత్తు చేసినట్లు ఆయన ప్రసంగాలు చెబుతున్నాయి. కులాల వారీగా హామీలు ప్రాంతాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై జగన్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాలను సరికొత్తగా ఉతికి ఆరేస్తున్నారు. అంతేకాదు ఈరెండు జిల్లాలో దాదాపు 500 ల కిలోమీటర్ల ను పాదయాత్రలో చేర్చారు. ఇప్పటికే పశ్చిమ పూర్తికాగా తూర్పు లో జగన్ తన ప్రజాసంకల్ప ప్రస్థానం కొనసాగిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన హోమ్ వర్క్ ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Related Posts