YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మండుతున్న ఎండలు

మండుతున్న ఎండలు
ఎండల తీవ్రత, వడగాల్పులపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నైసర్గికంగా చిత్తూరు జిల్లా  భూమధ్య రేఖకు సమీపంలో.. దక్కన్‌ పీఠభూమికి దక్షిణాన ఉంటుంది. తీర ప్రాంతానికి సుమారు 120 నుంచి 300 కి.మీ దూరంలో ఉంది. కేరళ, తమిళనాడు మీదుగా ఉత్తరాదికి వీచే నైరుతి రుతుపవనాలు.. జిల్లాకు పశ్చిమ పార్వ్శ దిశగా సాగిపోయాయి. దాంతో పెద్దగా వర్షాలు కురవలేదు. కాని జూన్‌ మొదటి వారం నుంచి వాతావరణం కాస్త చల్లబడింది. అడపాదడపా వర్షాలు కురియడంతో.. గాలిలో తేమ శాతం పెరిగింది.తాజాగా వారం రోజులుగా రుతుపనాలు విరామం ఇచ్చాయి. సముద్రం మీద నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కిందటి వారంతో పరిశీలిస్తే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2-4 డిగ్రీల సెల్సియస్‌ తేడా కన్పిస్తోందిఆకాశంలో మేఘాలు ఉన్నా ఎండ తీవ్రత సాయంత్రం 5.30 గంటల వరకూ కొనసాగింది. ఉదయం 8 గంటలకే ఎండ సుర్రుమంటోంది. పట్టణాలు, గ్రామాల్లో మధ్యాహ్న సమయంలో జన సంచారం తగ్గింది. చెరువులు, వాగుల్లోని నీరు వేగంగా ఇంకిపోతున్నట్లు రికార్డులు నమోదవుతున్నాయి. ఈ నెల ఆరంభంలో నీటితో కన్పించిన వాగులు, చెరువుల్లో ప్రస్తుతం నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తొలకరి వర్షానికి వేసిన వేరుసెనగ పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మరో ఒకట్రెండు గట్టి వర్షాలు పడే వరకూ రైతులు విత్తనాలు విత్తుకోవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. భూమిలో పూర్తిగా పొడి వాతావరణం పోయి.. బీజం అంకురించేందుకు సరిడపా తడి చేరాలని.. ఇందుకు ఒకట్రెండు మోస్తరు వర్షాలు కురవాలని సూచిస్తున్నారు.. జూన్‌ ప్రారంభంలో తిరుపతిలో ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదు కాగా.. నాలుగైదు రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. బుధవారం మధ్యాహ్నం తిరుపతిలో 41 డిగ్రీలు, చిత్తూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట గాలిలో తేమ శాతం (ఆర్ధ్రత) కనిష్ఠ స్థాయికి పడిపోతోంది. తిరుపతిలో ఒంటి గంట సమయంలో ఆర్ధ్రత 25శాతంగా, చిత్తూరులో 30 శాతంగా ఉంది. అంటే పూర్తిగా పొడి వాతావరణం అన్నమాట. ప్రమాదకర యువీ కిరణాలు తీవ్రత కూడా అధికంగా ఉంది. మధ్యాహ్న సమయంలో తిరుపతిలో 6 పాయింట్లు, చిత్తూరులో 7 పాయింట్లుగా నమోదైంది. ఇవి చెమట, ఉక్కపోతకు కారణమవుతున్నాయి.

Related Posts