YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెంకటేశ్వరస్వామి వ్యక్తా?..శక్తా..

వెంకటేశ్వరస్వామి వ్యక్తా?..శక్తా..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తులు నిత్యం పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల నమ్మకం. కాని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.దీనితో గతంలో ఏనాడూ జరగని రీతిలో ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయం వివాదాల్లో చిక్కుకుంది. తిరుమలలోని కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి వ్యక్తా? అంటూ టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి అంతే కాదు..ఆయన చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి వ్యక్తులకా చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చింది అని అవాక్కు కావాల్సిందే ఎవరైనా?.టీటీడీ అపవిత్రతకు భంగం కల్పిస్తున్నారు కాబట్టే టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడి రమణదీక్షితులకు నోటీసు పంపాం అంటున్నారు సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…‘ నూరు..కోట్లు..ఓం నమో వెంకటేశాయ. రమణదీక్షితుల ఆరోపణల వ్యవహారం కోర్టులో ఉంది. అక్కడే తేలుతుంది అసలు విషయం. వెంకటేశ్వరస్వామిని ఎంతో భక్తులు కొలిచే వ్యక్తిని..వ్యక్తులం..మహానుభావుడు. వెంకటేశ్వరస్వామి దేవుడి మీద రోజూ మాట్లాడటం సరికాదు. వెంకటేశ్వరస్వామే ఆయనకు సరైన గుణపాఠం చెబుతారు. ఆయనకు లోపాలు ఇప్పుడు కనపడుతున్నాయా?.మేం చెబుతున్నాం లోపాలు లేవు అని. 24 సంవత్సరాలు ఆయనే ఇక్కడ ఉన్నారు. లోపాలు ఎక్కడ ఉన్నాయో మీకే బాగా తెలుసు. తిరుమలకురండి. మీతో పాటు పాలు పంచుకుంటాం. మేం అన్నీ పరిశీలించాం. ఎక్కడ తప్పు జరగలేదనుకున్నాం. అందరం కలసి ఎక్సర్ సైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. తవ్వకాలు ఎప్పుడు జరిగాయని చెబుతున్నారు. డిసెంబర్ 5 నుంచి 20 వరకూ అని చెబుతున్నారు. ప్రధాన అర్చకులుగా మీరే ఉన్నరు. రండి..మేం కూడా వస్తాం. రమణదీక్షితులు అంటే మాకు గౌరవం ఉంది. ఎంతో కాలం సేవ చేసిన వ్యక్తి.
మేం నోటీసు పంపాం. తిరుమలకు రా. మేం రెండు నెలలు అయింది బాధ్యతలు తీసుకుని. మీరు 24 సంవత్సరాలు వెంకటేశ్వరస్వామి దగ్గర ఉన్నారు. భక్తులు అందరూ ఫస్ట్ వెంకటేశ్వరస్వామి. రెండు రమణ దీక్షితులు అనేవారు. ఈ రోజు అపప్రదలు వేయటం చాలా తప్పు. ఏదైనా తప్పు జరిగితే టీటీడీ బోర్డు రెడీ సరిదిద్దటానికి రెడీ..బోర్డు కార్యాలయం నుంచి ఆయన ఇంటికి కూడా పెద్ద దూరం లేదు. మాట్లాడదాం. అందులో ఎలాంటి వివాదం లేదు. అలా కాకుండా చెన్నయ్ లో, ఢిల్లీలో, హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టడం అనేది స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసేలా చేయటం కరెక్ట్ కాదు’ అంటూ సుధకర్ యాదవ్ వ్యాఖ్యానించారు.

Related Posts