సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు యోగ ఉత్తమ మార్గమని ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్, శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు తో కలిసి యంపి మాగంటి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యంపి మాగంటి బాబు మాట్లాడుతూ మనస్సును, శారీరక ఆరోగ్యాన్ని ఉన్నత ఆలోచనలు కలిగించి సమతుల జీవితాన్ని యోగ అందిస్తుందన్నారు. ప్రస్తుత జీవన విధానంలో ఉండే బాధ్యతలు , మానసిక, శారీరక ఒత్తిడిలు అధిగమించడానికి యోగ తోడ్పతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి కుటుంబం ఆనందంగా వుండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అన్నారు. దీనిని దృష్టిలో వుంచుకునే గత మూడు సంవత్సరాలనుండి యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా వుండాలన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా యోగ సాధన చేస్తే మానసిక ప్రశాంతత, ఆత్మస్థర్యం , మనోనిబ్బరం పెరుగుతాయన్నారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ జబ్బు వచ్చి బాధపడేకన్నా అదిరాకుండా ఉండేందుకు యోగవంటి సాధన ప్రతి ఒక్కరూ చేయాలన్నారు. యోగ కేవలం మనిషి ఆరోగ్యానికి పరిమితమైనదే కాదని ఆరోగ్యవంతమైన ఆలోచనలు అంకురించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ యోగవల్ల ఉద్రేకాలు, మానసిక ఒత్తిడి తగ్గి సమస్యలపై స్పష్టమైన విజ్ఞత కలుగుతుందన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యోగ నిపుణులు ధర్మారావు కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వారితో పలు యోగాసనాలు వేయించి వాటిని ఉపయోగాలను తెలియజేశారు. ఈ యోగాసన కార్యక్రమంలో ఏలూ రు ఎంపి శ్రీ మాగంటి బాబు, ఎంఎల్సి రాము సూర్యారావు, జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్ది, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ , నగర పాలక కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు డా.కర్రి ప్రసాదరావు, ఆర్ డి ఒ జి .చక్రదరరావు, వ్యవసాయశాఖ జెడి గౌసియా బేగం, డిఎస్ఒ హసిన్, ఎన్ జి .ఒ జిల్లా అధ్యక్షులు ఆర్ ఎస్ హరనాద్, తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధిశాఖల ఉద్యోగులు, శర్వాణి, సెయింట్ ఆన్స్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.