ముఖ్యమంత్రి సైనికుడిల పనిచేస్తున్నారని, మనమందరం సేవకులిల పనిచేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిత్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గలలో మంత్రి నారా లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కుప్పం నియోజకవర్గం,శాంతిపురం మండలం,రాళ్ళ బూదుగురు గ్రామం నందు ప్రజలను ఊదేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 2014 నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.228 కోట్లు ఖర్చు చేయడమైనది తెలిపారు. రాష్టం లో అందరికి మరుగుదొడ్లు నిర్మాణం కొరకు రూ.4500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో 5 వేలు జనాభా కలిగిన గ్రామ పంచాయితీ లలో అండర్ డ్రైనేజీ పనులను 3 నెలలో పూర్తి చేస్తామని తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నియోజకవర్గం లో రోడ్లు అభివృద్ధికి రూ.80 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు దీనికోసం ఇప్పటికే 40 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. ఇక్కడ ముస్లింలు షాదిఖానా కావాలని అర్జీలు ఇచ్చారని ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిశాఖరిస్తామని తెలిపారు. 3600 గృహాలు మంజూరు చేయడం జరిగిందని 2వేలు గృహాల మాత్రమే పూర్తి అయ్యాయని, మిగిలినవి కూడా వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికి పింఛన్లు, రేషన్ అందుతుందాని,అందురు మరుగుదొడ్లు వాడుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు కూలాయిన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 68 సంవత్సరాల వయసు లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్ట పడుతున్నారు ఆయనకు మనందరం సహాయసాహకారాలు అందించాలని కోరారు.చిత్తూరు జిల్లా కుప్పం ...
కుప్పం నియోజకవర్గం లో శాంతి పురం, కుప్పం లో 2 రోజుల పాటు మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగుళూరు విమానాశ్రయం చేరుకొన్న లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘాన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రహదారి మార్గం పై కర్ణాటక రాష్ట్రం కోలారు ,బంగారు పేట్ ,కే జి ఎఫ్ ఆంద్ర సరిహద్దు రాళ్ళ బుదుగురు వద్ద స్వాగత ఆర్చీ ని మంత్రి ప్రారంభించారు . మంత్రి నారా లోకేష్ కు కుప్పం టి డి పి శ్రేణులు పుష్ప గుచ్చం ఇచ్చి శలవతో సత్కరించారు. అనంతరం రాళ్ళబుదుగురుగ్రామ పంచాయితీ లో ప్రభుత్వ భవనం ప్రారంభించారు. ప్రజలతో తో మంత్రి కాసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్కరికని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజలకు అన్ని వెళ్ళల అండగా ఉండి టి .డి పి ప్రభుత్వం ఎల్లవేళలా సహకారం అందిస్తామని తెలిపారు. అక్కడ నుంచి రహదారి మార్గనా తుమ్ముసి గ్రామం నందున నిర్మించిన ఐ ,టి ఐ నూతన భవనని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
కుప్పం మండలంలోని చందం, నూలుకుంట, ఎన్.కొత్తపల్లె, గరిగచీనేపల్లె, వి.మిట్టపల్లె, మల్లానూరు పంచాయతీల్లోను స్థానిక ప్రజాప్రతినిధులు, తెదేపా నాయకులు, అధికారులతో కుప్పం అభివృద్ధి పనులపై సమీక్షించారు.
అంతకుముందు లోకేష్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో రానున్న మంత్రికి ఆంధ్ర- కర్ణాటక సరిహద్దులో రెడ్డివారిపల్లె వద్ద ద్విచక్ర వాహనాలతో ఘాన స్వాగతం పలికారు. వందలాది మోటారు సైకిళ్ల ర్యాలీలో పార్టీ కార్యకర్తలు మంత్రి తో వెళ్తూ లోకేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల స్వాగత బ్యానర్లు, తెదేపా జెండాలు అలంకరించారు.