YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

2400 కిలోమీటర్లు దాటిన జగన్ యాత్ర

2400 కిలోమీటర్లు దాటిన జగన్ యాత్ర
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారం‍భమైంది. ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. రాజన్న బిడ్డ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. రబీ సీజన్‌లో సాగు నీరు అందడం లేదని జగన్ అన్నారు. కొబ్బరికి స్థిరంగా ధర లేదు. పరిశ్రమలు లేవు. కనీసం తాగేందుకు నీరూ లేని దుస్థితి. బతకడానికి జిల్లా కాదు.. ఏకంగా దేశాన్నే వదలి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. అందుకే ‘అన్నా.. బాబు వస్తే మాకు నీళ్లు రావు, మా పంటలకు రేట్లు ఉండవు, రుణాలు రావు, వడ్డీ రాయితీ ఉండదన్నా.. బాబు వస్తే వ్యవసాయమే దండగగా మారుతుందన్నా.. రైతు ఇల్లు గుల్లవుతుందన్నా..’ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రబీ సీజన్‌లో ఈ నియోజకవర్గంలో 35 వేల ఎకరాల ఆయకట్టు శివారు భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా, కాల్వలు పూడుకుపోయినా పట్టించుకునే నాథుడు లేడు. చింతలపల్లి, శంకరగుప్తం, కత్తిమండ, గూడపల్లె, జి.పల్లిపాలెం, గుబ్బలపాలెం ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అష్టకష్టాలు పడి పంటలు పండించి మార్కెట్‌కు తీసుకువెళితే అక్కడ రేటు ఉండదు. వరి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1550 అయితే రూ.1130కి కూడా కొనే నాథుడు లేడు.అక్కడి నుంచి లక్కవరం క్రాస్‌ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర  కొనసాగనుంది. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంటుంది. అడుగడుగునా ప్రజలు జననేతకు నీరాజనాలు పలుకుతున్నారు.వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Related Posts