రోజంతా కన్సాలిడేషన్ బాటలో నడిచిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 100 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్, చివరికి అమ్మకాల ఒత్తిడితో 115 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో 35,432 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ సైతం 31 పాయింట్ల మేర నష్టాలు పాలై, 10,800 కింద 10,741 వద్ద స్థిరపడింది. గురువారం ట్రేడింగ్‌లో ఎక్కువగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ సుమారు 2 శాతం మేర కిందకి పడిపోయింది. సెన్సెక్స్ స్టాక్స్‌లో ఎక్కువగా మహింద్రా అండ్ మహింద్రా, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ 2.28 శాతం, 1.08 శాతం, 1.72 శాతం నష్టపోయాయి. ఈ నష్టాల్లోనే ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 1 శాతం మేర పైకి జంప్ చేశాయి. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ డెవలప్‌మెంట్లను ఇన్వెస్టర్లు ఎంతో సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఒపెన్ నుంచి కూడా ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు