YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఇక నుంచి ట్రెండింగ్ వార్తలే ప్రధానం ..

 ఇక నుంచి  ట్రెండింగ్ వార్తలే  ప్రధానం ..

 సరికొత్త కార్యక్రమానికి  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శ్రీకారం 

‘సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్’ ద్వారా దేశంలోని వివిధ జిల్లాల్లో ట్రెండింగ్ వార్తలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను సేకరించనుంది. ఈ ప్రాజెక్టు కింద కొందరి మీడియా ప్రతినిధులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోనున్నారు. ప్రతి జిల్లాలో జరిగే విషయాలపై వీరంతా దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో కచ్చితమైన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చేరవేస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించడం, ఆయా ప్రాంతాల్లోని ట్రెండింగ్ న్యూస్‌ను గుర్తించి ప్రభుత్వానికి పంపుతారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను విశ్లేషించేందుకు కేంద్ర స్థాయిలో నిపుణులను కూడా నియమిస్తారు.
ఈ ప్రాజెక్టు విషయంలో ఓ సాప్ట్‌వేర్‌ను రూపొందించి అందించేందుకు ఇటీవల, కేంద్ర మంత్రిత్వ శాఖలో ప్రసార ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్), పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ (పీఎస్‌యూ) సంస్థ కింద టెండర్ వేశారు. అన్ని సోషల్ మీడియాల ప్లాట్‌ఫాంల నుంచి డిజిటల్ మీడియాను సమాచారాన్ని సేకరించేందుకు ఇలాంటి ఓ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. దీనిద్వారా డిజిటల్ వేదికలైన బ్లాగ్‌ల్లో ట్రెండ్ అయ్యే సమాచారమంతా ఒకే వేదిక కిందకు వచ్చేలా తీసుకురావాలని టెండర్‌లో పేర్కొన్నారు. ఈ సాప్ట్‌వేర్ టూల్ హిందీ, ఉర్దూ, తెలుగు, మళయాళం, కన్నడ, బెంగాలీ, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్ వంటి పలు భాషలకు కూడా సపోర్ట్ చేసేలా ఉండాలని టెండర్‌ పేర్కొంది. 

Related Posts