జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో పటమట ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్నారు. ఈ రోజు ఉదయం గృహ ప్రవేశం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి పవన్ సతీమణి అన్నా లెజినోవా హాజరు కాలేదు. తనకు, రేణూ దేశాయ్ కి పుట్టిన కుమారుడు అకీరా వచ్చాడు. తన పెద్దకుమారుడిని వెంట బెట్టుకుని పవన్ గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. పవన్ ఆ ఇంట్లో ఉన్నంత సేపూ ప్రత్యేక సెక్యూరిటీని, 24 గంటల కాపలా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.