'బాహుబలి' సినిమా ద్వారా రమ్యకృష్ణ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తరువాత ఆమె తెలుగు, తమిళ బాషలలో వరుస అవకాశాలు వస్తున్నాయి. కథలో బరువైన .. బలమైన లేడీ కేరక్టర్ ఉందనగానే వెంటనే రమ్యకృష్ణను సంప్రదించేస్తున్నారు. ఆమె ఎంత పారితోషికాన్ని అడిగినా వెనకడుగు వేయకుండగా ఇచ్చేస్తున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆమె వరుసగా 25 రోజులు డేట్స్ ఇచ్చారట. ఒక్కొక్క రోజుకి 6 లక్షల చొప్పున ఆమె ఈ 25 రోజులకి కలుపుకుని కోటిన్నర తీసుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.