రాజకీయాల్లో ఆఫర్లు రావడం అంటే.. ఇప్పుడున్న కాలంలో చాలా అరుదు! కాంపిటీషన్ పెరిగిపోవడం, నియోజకవర్గానికి ఇద్దరేసి, ముగ్గురేసి చొప్పున బలమైన నాయకులు పెరిగిపోవడం కారణంగా.. ఆఫర్ రావడం అంటే..పెట్టిపుట్టాలనే టాక్ ఉంది. ఇక, ఇలాంటి ఆఫర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఆఫర్లు ఒకే నేతకు తగిలితే.. ఎలా ఉంటుంది?! ఆశ్చర్యం అనిపించినా.. కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రస్తుతం తటస్థంగా ఉన్న సబ్బం హరి.. త్వరలోనే టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలోనే ఆయన అసెంబ్లీకా, లేక పార్లమెంటుగా అనేది ఇంకా తేల్చుకోలేదు. ఇక, గత కొన్నాళ్లుగా ఆయన వినిపిస్తున్న వాయిస్‌ను బట్టి.. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయనను ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సిద్ధంగానే ఉన్నారు., అంతేకాదు, ఆయన పార్టీలోకి వస్తే.. ఆయన కోరుకున్న సీటును ఇచ్చేందుకు కూడా బాబు రెడీగా ఉండడం గమనార్హం. విశాఖ ఉత్తరం లేదా.. భీమిలి.,. ఈ రెండు కూడా కాదంటే.. మాడుగుల సైతం ఇచ్చేందుకు రెడీ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి సబ్బం హరి దృష్టి.. విశాఖ ఉత్తరంపైనే ఉంది. ఇక్కడ నుంచి ప్రస్తుతం బీజేపీ నేత విష్ణుకు మార్ రాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ బీజేపీతో పొత్తు ఉండదు కాబట్టి.. టీడీపీ ఒంటరిగానే బరిలోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో సబ్బం హరి టీడీపీ పక్షాన ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే.. భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారతాడని, ఆయన సేవలను కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసుకోకూడదని కూడా టీడీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన తర్వాత కూడా రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో నిలిచారు సబ్బం హరి! ముఖ్యంగా జగన్‌పై ఆయన చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు.. టీడీపీ అనుకూల వ్యాఖ్యలతో మీడియాలో సంచలనం సృష్టించారు. గత ఎన్నికల్లో మౌనంగా ఉండిపోయిన సబ్బం.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మాత్రం కీలకంగా మారాలని నిర్ణయించుకున్నారు.టీడీపీ అధిష్టానం ఆలోచన మాత్రం.,. సబ్బం హరిని పార్టీలోకి తీసుకుని మాడుగుల నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇలా ఎలా చూసినా.. సబ్బం హరికి అధికార టీడీపీలో మూడు ఛాన్సులు అయితే, స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిఆయన ఏ ఛాన్స్ యూజ్ చేసుకుని విజృంభిస్తారో చూడాలి. ఇక, ఆయనను ఏ నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపినా.. ఆయన సేవలను జిల్లా వ్యాప్తంగా వినియోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.