YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మోత్కుపల్లి యాత్రకు బ్రేక్

మోత్కుపల్లి యాత్రకు బ్రేక్
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉండి, అనేక బాధ్యతలు నిర్వహించిన మోత్కుపల్లి నర్సింహులు.. ఇటీవల ఆ పార్టీకి ఎదురు తిరిగారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి టీడీపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అడపాదడపా ఆ పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాలని తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటా అని కూడా ప్రకటించారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో పాదయాత్ర చేస్తానని చెప్పారు.టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటి నుంచి ఆయనపై వైసీపీ నేతలకు కన్ను పడింది. ఆ మధ్య కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. మోత్కుపల్లి ఇంటికి వెళ్లి మరీ ఆయనతో భేటీ కాగా, ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియా ప్రతినిధులు ఉండడంతో మోత్కుపల్లిని కలవకుండానే వెళ్లిపోయారు. మళ్లీ రెండు రోజుల తర్వాత మోత్కుపల్లి ఇంటికి వెళ్లిన విజయసాయి.. ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మోత్కుపల్లి ఏపీలో చేయబోయే యాత్రకు వైసీపీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆయన వెనుక వైసీపీ ఉందనే ప్రచారం కూడా జరిగింది.ఏపీలో యాత్ర చేయాలని నిర్ణయించుకున్న మోత్కుపల్లి నర్సింహులుకు భారీ ఎదురుదెబ్బ తగిలిందట. టీడీపీపై పోరాటం చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన అనుచరులు.. ఏపీలో యాత్ర చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయాలనుకుంటున్న మోత్కుపల్లి ఏపీలో యాత్ర చేయడం వల్ల ఆయనకు కలిగే లాభమేంటని అనుకుంటున్నారట. ఆయన ఏపీలో చేయబోయే యాత్రకు వెళ్లబోయేదే లేదని పలువురు ఇప్పటికే ప్రకటించారట. దీంతో ఏం చేయాలో తోచక మోత్కుపల్లి అయోమయానికి గురవుతున్నారట. ఇదిలా ఉండగా, మోత్కుపల్లి ఏపీలో యాత్ర చేయడానికి వైసీపీనే నిధులు ఇస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది.

Related Posts