టీడీపీలో అపసవ్య విధానాలపై రమణ దీక్షితులు సుమారు రెండు నెలలుగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. అర్చకుల పదవీవిరమణ ఇష్యూను నుంచి మొదలైన ఈ వివాదం.. ఫైనల్ గా పొలిటికల్ కలర్ పులుముకుంది. ఇక దీక్షితులు కూడా జోరుగా బీజేపీ, వైసీపీ నేతలతో భేటీలు కావడంతో .. ఆయన ఆరోపణల వెనుక ఆ రెండు పార్టీలు ఉండొచ్చన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక హైదరాబాద్ లో జరిగిన ఆయన తాజా ప్రెస్ మీట్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమణ దీక్షితులు ఇతరమతాలకు చెందిన వారితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రమణ దీక్షితులు అన్యమత ప్రచారకులతో చేతులు కలిపారని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఫైర్ అవుతున్నారు. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారని ఆరోపిస్తున్నారు.
గుంటూరుకు చెందిన అనిల్.. సైమన్స్ అమృత్ ఫౌండేషన్ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. అనిల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. దీక్షితులు మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకుని ఆయనా మాడ్లారారు. తిరుమలలో అన్యమతస్థులకు చోటు ఉండరాదని భావించే వారిలో రమణ దీక్షితులు కూడా ప్రథములే. అయితే ఆయన క్రైస్తవం అనుసరించే అనిల్ తో కనిపించడంపై వ్యతిరేకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే.. అనిల్ క్రిస్టియన్ అనే విషయం కంటే.. ఆయన జగన్ కు దూరపు బంధువు అనే అంశమే.. హాట్ ఇష్యూగా మారింది. ఇదిలాఉంటే బోరుగడ్డ అనిల్‌పై పలు కేసులు, ఆరోపణలున్నాయి. దీంతో ఇలాంటి వ్యక్తితో రమణ దీక్షితులు సన్నిహితంగా ఉండడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.